telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సద్దుల బతుకమ్మ ఎఫెక్ట్.. చామంతి పువ్వులు కిలో రూ.600

flowers sale in market

తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండగ వేళ పూల ధరలకు రెక్కలొచ్చాయి. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చాలనుకున్న మహిళలు ఒక్కసారిగా పూల ధర పెరగడంతో కొద్ది పూలతోనే బతుకమ్మను పేర్చాల్సివచ్చింది. బతుకమ్మకు అవసరమైన బంతి, చామంతి పూల కోసం బజారుకు వచ్చిన మహిళలు కొండెక్కిన ధరలు చూసి ఖంగుతిన్నారు.

సాధారణ రోజుల్లో రూ.50కు కిలో విక్రయించే బంతిపూలను శనివారం వరంగల్‌ ప్రధాన తపాలా కార్యాలయం కూడలిలోని దుకాణాలలో కిలో రూ.100కు విక్రయించారు. సాధారణ రోజుల్లో కిలో రూ.300కు లభించే చామంతి పూలు శనివారం కిలో రూ.600కు విక్రయించారు. పూల ధరలకు రెక్కలు రావడంతో కిలో కొనుగోలు చేయాలనుకున్న మహిళలు అరకిలోతో సరిపెట్టుకున్నారు.

Related posts