telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బంగారు బుల్లోడు” టీజర్

Bangaru Bullodu

యంగ్ హీరో అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోయారు. ఆయన ఈ మధ్య చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన‌ హీరోగా వస్తున్న సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతుంది, పివి గిరి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో పూజా జవేరీ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బంగారు బుల్లోడు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా వస్తుంది. అయితే రేపు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేస్తూ తెలిపింది. అయితే చూడాలి మరి ఈ సినిమా అయిన హిట్ అవుతుందా… లేదా అనేది.

Related posts