telugu navyamedia
సినిమా వార్తలు

మలైకా రెండవ పెళ్ళి… మాజీ భర్త అనూహ్య స్పందన

Arbhaz-Khan-and-malaika-arora-khan

“కెవ్వు కేక” అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హాట్ భామ మలైకా అరోరా. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ ను ఈనెల 19న ఓ చర్చ్ లో వివాహం చేసుకోబోతోంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ విషయంపై అటు అర్జున్ కపూర్ గానీ, మలైకా కానీ స్పందించలేదు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాజీ భర్త అర్భాజ్ ఖాన్ కు మలైకా వివాహం గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు అర్భాజ్ ఖాన్ స్పందించిన తీరు అందరికీ షాకిచ్చింది. మలైకా వివాహానికి సంబంధించిన ప్రశ్న ఎదురవ్వగానే అర్భాజ్ ఖాన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. పెళ్లిపై ప్రశ్న అడిగేందుకు మీరు ఎంతో సమయం తీసుకొని అడిగారు. అదే విధంగా సమాధానం చెప్పడానికి నాకు కూడా సమయం కావాలి. ఈ విషయంపై రేపు సమాధానం ఇస్తాను అని అర్బాజ్ నవ్వుతూ చాలా తెలివిగా తప్పించుకున్నాడు అర్భాజ్. దీంతో మలైకా మాజీ భర్త కాంట్రవర్సీలకు తావివ్వకుండా భలే తప్పించుకున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Related posts