telugu navyamedia
news political

శ్రీనగర్ లో అమిత్ షా.. లడాఖ్ లో ధోనీ!

amith shah bjp

భారత దేశ వ్యాప్తంగా రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొనున్నారు. రేపు అన్నీ ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. దీనికి సంబంధించి అన్ని దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరగుతున్నాయి. జమ్ముకశ్మీర్ లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు.

ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జమ్ముకశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కళాకారుల బృందాలతో ఇప్పటికే అక్కడ సందడి నెలకొంది. మరోవైపు, లడాఖ్ లో టీమిండియా క్రికెటర్ ధోనీ జాతీయ జెండాను ఎగురవేయనున్నాడు.

Related posts

బిగుస్తున్న ఉచ్చు.. రవిప్రకాశ్, శివాజీలకు లుకవుట్ నోటీసులు

ashok

ప్రేమ కోసం…

vimala p

చంద్రబాబు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్ ఫైర్

vimala p