telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

3వేల ఉపగ్రహాల ప్రయోగానికి .. అమెజాన్ నిర్ణయం..

america media blackmailing amazon ceo

వ్యాపార విస్తరణే నూతన ఆలోచనలను, వాటి కార్యాచరణను రూపొందిస్తుందని మరోసారి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిరూపిస్తుంది. దానికి నిదర్శనం తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా కనిపిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఏకంగా 3 వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘ప్రాజెక్ట్ కుయిపెర్’ను ప్రారంభించింది.

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ అవసరాలకు నోచుకోని ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వీటి ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించి ఈ దీర్ఘకాలిక ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు తెలిపింది. తక్కువ ఎత్తులో పరిభ్రమించే ఈ ఉపగ్రహాలతో లో-లేటెన్సీ, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని అందించగలవని కంపెనీ పేర్కొంది.

Related posts