telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నూతన దర్శకుడితో అల్లరి నరేష్ కొత్త చిత్రం

Allari-Naresh

హీరో అల్ల‌రి నరేష్ క‌థానాయ‌కుడిగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ప్రారంభం కానుంది. న‌రేష్ ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించిన‌ ‘మ‌హ‌ర్షి’ చిత్రంలో న‌రేశ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌రో వైపు త‌న‌దైన మార్క్ కామెడీ మూవీ ‘బంగారు బుల్లోడు’ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. న‌రేశ్ న‌టించ‌బోయే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ‘మోస‌గాళ్ల‌కు మోస‌గాడు’, ‘ఒక్క క్ష‌ణం’ చిత్రాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా మారి ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Related posts