telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘బజార్ రౌడీ’ అంటున్న సంపూర్ణేశ్ !

“హృదయ కాలేయం”, “సింగం 123” తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు “కొబ్బరి మ‌ట్ట” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. బ‌ర్నింగ్ స్టార్ గా అభిమానుల‌చే పిల‌వ‌బడుచున్న సంపూ 2015లో “కొబ్బ‌రి మ‌ట్ట” అనే చిత్రం తీశాడు.  ‘కరెంట్ తీగ, బందిపోటు, జ్యోతిలక్ష్మి, పెసరట్టు, రాజా ది గ్రేట్, దేవదాస్, కథనం’ వంటి సినిమాలలో కేమియో రోల్స్ లో కనిపించి అలరించాడు. ఇక బిగ్ బాస్ కి వెళ్ళి హంగామా చేసి బయటకు వచ్చిన సంపూర్ణేశ్ తాజాగా మరో సినిమాతో ఆడియన్స్ ముందుక రాబోతున్నాడు. ఈ సినిమాకు అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమా ఫస్ట లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించనున్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావు, వసంత నాగేశ్వరరావు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Related posts