telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ లోని అఖిలప్రియ ఇంటికి ఏపీ పోలీసులు..

bhuma akhila into ycp soon

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చి హల్‌చల్ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి ఆళ్లగడ్డకు చెందిన పోలీసులు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏదైనా సెర్చ్ వారెంట్ ఉందా? అని అడిగిన అఖిల ప్రియ, వారెంట్ లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసుల వైఖరిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

పోలీసులు తమ పక్కింట్లోకి వెళ్లి, అక్కడి నుంచి గోడ దూకి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపించిన ఆమె, ఇంట్లోని సామాన్లను కూడా వారు ధ్వంసం చేశారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎస్పీ చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తూ, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై తాము కూడా పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు.

Related posts