telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్మాత పడకగదికి రమ్మన్నాడు…నటి ఆరోపణలు

Girl

సీరియల్ యాక్టర్‌గా ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటి వాని భోజన్. మాయ అనే టీవీ సీరియల్ ద్వారా ఆమె నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘దైవమగళ్’ అనే సీరియల్‌లో ఆమె చేసిన సత్య అనే పాత్ర ద్వారా ఆమెకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన వాణి ‘ఓ మై కడవులే’ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం వైభవ్‌తో జతకట్టిన లాకప్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.కాస్టింగ్‌ కౌచ్‌, మీటూ పేరుతో దేశ వ్యాప్తంగా సీని పరిశ్రమలో పెద్ద ఉద్యమమే మొదలయ్యింది. అప్పట్లో అనేకమంది నటీమణులు మీటూ పేరుతో తమ బాధలను వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది వాని భోజన్. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధనం ఇస్తూ… తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయంది. ఒక నిర్మాత అవకాశం కోసం పడక గదికి రమ్మన్నాడని చెప్పింది. అలాంటి అవకాశం తనకు అవసరం లేదని ఆ నిర్మాతకు చెప్పానంది. తాజాగా వాణిబోజన్‌ చేసిన కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ ఇప్పుడు కోలివుడ్‌లో హాట్ టాపిక్‌గా మరాయి. వాణిని బెడ్ రూంకు పిలిచిన ఆ నిర్మాత ఎవరంటూ కోలీవుడ్ అంతా ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో మరోసారి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కలకలం రేపింది. వాణి బోజన్‌ సాధారణంగా తన మేనేజర్‌తోనే నిర్మాతలు సంప్రదిస్తారని తెలిపింది. అలా పలువురు నిర్మాతలు అవకాశాల కోసం తనను పడక గదికి పిలిచినట్లు మేనేజర్‌ తనకు చెప్పారని అంది.ఇటీవలే మీటూ ఉద్యమానికి బీజం పడిన హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత హర్వే వీన్ స్టీన్‌కు ఓ నటిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఇటీవలే మీటూ ఉద్యమానికి బీజం పడిన హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత హర్వే వీన్ స్టీన్‌కు ఓ నటిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్,సింగర్ చిన్మయి కూడా మీటూపై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Related posts