telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కేసును మర్యాదగా వెనక్కి తీసుకోకపోతే… శ్రీరెడ్డి దారుణమైన పోస్టులు

శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ద్వారా కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్‌లపై బూతులు మొదలెట్టారు.అయితే వీరి మధ్య దూషణల పర్వం పెరిగి పెద్దది కావడంతో శ్రీరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టింది నటి కరాటే కళ్యాణి. ఈ ఇష్యూపై వివాదం నడుస్తున్న సందర్భంలో మరో మారు కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్‌లను టార్గెట్ చేస్తూ ఆదివారం నాడు ఓ వీడియో వదలింది శ్రీరెడ్డి. ‘కరాటే కళ్యాణి గారూ బాగున్నారండీ.. రాకేష్ బాబాయ్ బాగున్నారా? ఏంటి.. నా మీద కేసు పెట్టారంట కదా.. భలే పాపులర్ చేస్తున్నారుగా.. నన్ను పాపులర్ చేయడం అంటే రాకేష్‌కి, కళ్యాణికి బాగా ఇష్టం కదా థాంక్యూ.. ఇప్పుడు విషయం ఏంటంటే.. కేసును మర్యాదగా వెనక్కి తీసుకోకపోతే రివర్స్‌లో పరువు నష్టం దావా వేస్తా’ అంటూ వీడియోలో వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. అయితే మంగళవారం నాడు రాయడానికి వీలులేని భాషలో రాకేష్ మాస్టర్, కళ్యాణిలకు సంబంధం అంటగడుతూ దారుణమైన పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. రాకేష్ మాస్టర్‌కి ఎయిడ్స్ అంటూ కళ్యాణిపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటూ నెలకు ఒకసారి చెన్నై కోర్టు చూసి వెళ్దురు గాని.. మీరందరూ రండి కుళ్లు అక్క, రెక్క బాబాయ్.. రండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కి ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తూ పులిహోర, దద్దోజనం, సోషల్ వేస్ట్, మిర్రర్ లో తొర్రి అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఆ ఛానల్స్ పేర్లను ప్రస్తావిస్తూ కేసులకు రెడీగా ఉండండి అంటూ హెచ్చరించింది శ్రీరెడ్డి. పేకాటలో పోలీసులు పట్టుకున్న *** నిన్ను చూసి నేను డ్రెస్సింగ్ స్టైల్ నేర్చుకున్నానా? తూ బతుకు అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.

Related posts