telugu navyamedia
సినిమా వార్తలు

ఆ దర్శకుడి చెంప పగలగొట్టా… నటి కామెంట్స్

Raksha

తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన నటి “రక్ష”. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా “అలీతో సరదాగా” షోలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తండ్రి నిర్మాతగా రెండు సినిమాలు తీసి నష్టపోయారని, దాంతో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా… తన ఇష్టంతో నటిగా కెరీర్ మొదలుపెట్టినట్లు తెలిపింది. అయితే తనతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అసలు ఊరుకోనని అంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ డైరెక్టర్ చెంప పగలగొట్టిన విషయాన్ని వివరించింది. ఆ డైరెక్టర్ కథ చెప్పినప్పుడు గ్లామర్ పాత్రల్లో నటించను, నాకు పెళ్లైంది, కూతురుంది.. స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోనని చెబితే మొదటి ఓకే చెప్పిన ఆ దర్శకుడు సెట్ కి వెళ్లిన తరువాత తేడాగా ప్రవర్తించడం అంటే ద్వందార్ధాలు వచ్చేలా పొగడడం, పదే పదే ఏదో రకంగా విసిగించడం చేస్తుండడంతో “ఒరేయ్ ఇలా రారా” అని పిలిచి చెంపమీద లాగిపెట్టి కొట్టా.. అంటూ చెప్పుకొచ్చింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామని అనుకున్నానని, ఆ సినిమా హీరో వచ్చి “వద్దు మేడం.. సినిమా ఆగిపోతుంది” అని చెప్పడంతో వదిలేశానని చెప్పుకొచ్చింది. “నచ్చావులే” సినిమాలో హీరో తల్లిగా నటించినందుకు ఆమెకు నంది అవార్డు దక్కింది.

Related posts