telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ ను బాధపెట్టిన సినిమా… !?

chiru

తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత “ఖైదీ నెంబర్ 150” సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి కే.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన “స్వాతిముత్యం” సినిమా చూసి తెగ బాధపడ్డారట. ఇలాంటి సినిమా తానేందుకు చేయలేదని తెగ ఫీలయ్యాడట. ఆ విషయాన్ని ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు చెప్పుకొచ్చారు. అప్పట్లో చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి సమయంలో చిరు ‘స్వాతిముత్యం’ సినిమా చూశారు. ఆ సినిమా చూసిన తర్వాత చిరుకు రెండు రోజులు నిద్రపట్టలేదట. ఇలా కూడా నటిస్తారా ? అనిపించింది. తనకు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావడం లేదంటూ తీవ్రంగా కుమిలిపోయారట. ఆ తర్వాత కే.విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘స్వయంకృషి’ సినిమా చేసారు. గతంలో వీళ్లిద్దరు ‘శుభలేఖ’ సినిమా చేసినా.. అప్పటికీ చిరుకు స్టార్‌డమ్ లేదు. చిరు స్టార్‌డమ్ అందుకున్న తర్వాత విశ్వనాథ్‌తో ‘స్వయంకృషి’ సినిమా చేసారు. ఈ సినిమాలో చిరు చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించారు. అందుకోసం చిరు చెప్పులు బాగా కుట్టడం తెలిసిన వ్యక్తిని సెట్‌లో పెట్టుకుని ఆయన సూచనల మేరకు ఈ సినిమా షూటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో చిరంజీవి తొలిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చే నంది ఉత్తమనటుడు అవార్డు తొలిసారి అందుకోవడం విశేషం. ప్రస్తుతం చిరంజీవి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేసాడు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts