telugu navyamedia
news political trending

లాహోర్ నుంచి బయల్దేరిన అభినందన్‌

Abhinandan start from Lahore Pakistan

పాకిస్తాన్‌ ఆర్మీ అదుపులో ఉన్న భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వర్థమాన్‌ లాహోర్ నుంచి బయల్దేరారు. మరి కాసేపట్లో పాక్‌ సైన్యం వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించనుంది. ఈ సందర్భంగా అభినందనకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఐఏఎఫ్‌ అధికారులు వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. అభినందన్‌ రాకకోసం అన్ని ఏర్పాట్లు చేశామని అమృత్‌సర్‌ కలెక్టర్‌ తెలిపారు.

అభినందన్ స్వదేశానికి  రాగానే వైమానిక దళ అధికారులకు అప్పగిస్తామన్నారు. అభినందన్‌కు స్వాగతం పలకడానికి పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ కూడా వచ్చారు. వాఘా సరిహద్దుకు చేరుకున్న తర్వాత అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వాఘా సరిహద్దులో బీటింగ్‌ ద రిట్రీట్‌ కార్యక్రమం రద్దు చేశారు. సందర్శకులు వాఘా సరిహద్దుకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related posts

ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డి

vimala p

షియోమీ నుండి.. రెడ్ మి 7ఎ .. బడ్జెట్ లో ..

vimala p

ఆర్టీసీ కార్మికుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: పవన్

vimala p