telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లి విషయం స్వయంగా ప్రకటించిన కాజల్

Kajal

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి విషయమై, సీక్రెట్‌గా ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ‘నేను ఎస్ చెప్పాను’ అని పోస్ట్ పెట్టింది కాజల్. ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్‌ కిచ్లుతో త్వరలో కాజల్ పెళ్లి జరగబోతుంది..కొద్ది సేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా కాజల్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 30న గౌతయ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. ముంబై లోని ఓ హోటల్ లో ఈ పెళ్లి జరగబోతుంది. కరోనా మహమ్మారి వలన ఈ వేడుకకి అత్యంత సన్నిహుతులు మాత్రమే హాజరుకానున్నారని తెలిపింది కాజల్. “ఇన్నేళ్ళ నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలుస్తూ నాపై ప్రేమను చూపిస్తున్న మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు” అని కాజల్ పేర్కొంది.ప్రస్తుతం కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న ‘భారతీయుడు 2’లో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్‌ సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది.

Related posts