telugu navyamedia
రాజకీయ వార్తలు

అభినందన్ కు అరుదైన గౌరవం..”వీరచక్ర” పురస్కారం!

Abhinandan start from Lahore Pakistan

పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి వేసిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ కు అరుదైన గౌరవం దక్కనుంది. పాక్ ఆర్మీ చెరలో బంధీగా ఉండి విడుదలైన అభినందన్ ధైర్యసాహసాలను భారత ప్రభుత్వం గౌరవించనుంది. రేపు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందన్ ను ‘వీరచక్ర’ గ్యాలెంట్రీ మెడల్ తో సత్కరించనుంది.

ఫిబ్రవరి 27న పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్ ఆ తర్వాత పాక్ ఆర్మీ చేతికి చిక్కారు. ఆ తర్వాత ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పాక్ ఆర్మీ అధికారులకు ఆయన సమాధానాలు ఇచ్చిన వీడియా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే అభినందన్ భారతదేశ హీరో అయిపోయారు.

మార్చి 1న వాఘా సరిహద్దులో అడుగుపెట్టిన అభినందన్ కు భారత ప్రజలు జయజయ ధ్వానాలతో స్వాగతం పలికారు.మరోవైపు, సెక్యూరిటీ కారణాల రీత్యా వెస్టర్న్ సెక్టార్ లో ఉన్న బయటకు వెల్లడించని ఓ ఎయిర్ ఫోర్స్ బేస్ లో అభినందన్ కు పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే అభినందర్ తన సాధారణ విధులకు హాజరవుతారని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ధనోవా ఇటీవల తెలిపారు.

Related posts