telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆఖరి టీ20కి .. మార్పులతో భారత్ ప్రయోగం.. క్లీన్ స్వీప్ సాధించేనా ..

5th t20 with changes in indian team

న్యూజీలాండ్ తో ఐదు టీ20ల సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లను గెల్చుకొని 4-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన నేటి మ్యాచ్‌నూ విజయంతో ముగించాలని చూస్తోంది. నాల్గో మ్యాచ్‌కు రోహిత్‌, షమి, జడేజా విశ్రాంతి తీసుకోగా… నవ్‌దీప్‌ సైనీ, సంజు సాంసన్‌, దూబే తుదిజట్టులో వచ్చి చేరారు. ఆదివారం జరిగే ఆఖరి మ్యాచ్‌కు ఏకంగా కోహ్లీ, బుమ్రా, రాహుల్‌ విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో కుర్రాళ్లు సత్తా చాటాల్సిన అవసరమెంతైనా ఉంది. సొంతగడ్డపై ఇప్పటి వరకు ద్వైపాక్షిక (3 అంతకన్నా ఎక్కువ మ్యాచులు) టీ20 సిరీస్‌లు న్యూజిలాండ్‌ ఓడలేదు. ప్రస్తుతం కోహ్లీసేన ఆతిథ్య జట్టుకు ఆ రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం జరిగే ఆఖరి పోరులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సుదీర్ఘ కాలంగా ఉన్న ఐదో ర్యాంకు నుంచి మరో మెట్టు ఎక్కాలని పట్టుదలతో కనిపిస్తోంది. లేదంటే పాక్‌, ఆసీస్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానంలోనే ఉండాల్సి వస్తుంది. అందుకే భారత్‌ తన ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటోంది.

ఆఖరి మ్యాచులోనూ ప్రయోగాలకే పెద్దపీట వేయనుంది. సంజు శాంసన్‌, శివమ్‌ దూబెకు మరో అవకాశం ఇవ్వనుంది. నాల్గో మ్యాచ్‌ తుదిజట్టులో చోటు దక్కించుకున్న సంజు త్వరగా ఔటయ్యాడు. భారీ షాట్లు ఆడగల దూబె ఫుట్‌వర్క్‌ మెరుగుపర్చుకొని సత్తా నిరూపించుకోవాలి. ఒకవేళ సీనియర్లు విశ్రాంతి తీసుకుంటే శ్రేయస్‌ మూడో స్థానంలో, మనీశ్‌ పాండే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఫామ్‌ లేమితో బాధపడుతున్న రిషభ్‌ పంత్‌కూ ఆఖరి మ్యాచ్‌లో చోటు దక్కే అవకాశముంది. అయితే అతడికి ఎంతో ఒత్తిడి పెరిగింది. అటు కీపింగ్‌ ఇటు బ్యాటింగ్‌లో రాణించక తప్పని పరిస్థితి నెలకొంది. ధోనీకి వారసుడిగా భావించిన అతనిప్పుడు తొలి ప్రాధాన్య కీపర్‌ కాకుండా పోయాడు!

ఇక న్యూజిలాండ్‌ విషయానికొస్తే ప్రపంచకప్‌ నాటి నుంచి వారికి సూపర్‌ ఓవర్లు అంటేనే వణుకు పుడుతోంది. అలాంటిది ఈ సిరీస్‌లో వరుసగా రెండు సూపర్‌ ఓవర్లు ఆడి ఓటమి పాల వ్వడం వారిని మరింత బాధిస్తోంది. దక్షిణాఫ్రికా తరహాలో ఆఖర్లో ఒత్తిడికి చిత్తవుతున్నారు. కనీసం ఈ మ్యాచులోనైనా గెలిచి వన్డే సిరీస్‌కు ఆత్మస్థైర్యంతో వెళ్లాలని కివీస్‌ జట్టు భావి స్తోంది. భుజం గాయంతో దూరమైన విలి యమ్సన్‌ కోలుకున్నాడని తెలిసింది. ఇంతకుమించి ఆతిథ్య జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు. టీమిండి యా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కూ దూరమయ్యాడు. హార్దిక్‌ పాండ్యా వెన్నుగాయం నుంచి కోలుకోపో వడంతో అతనిపై ఆశలను వదులుకున్నారు. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు హార్దిక్‌ అందుబాటులో ఉండటం లేదని బిసిసిఐ స్పష్టం చేసింది.

Related posts