హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ రోజు ఉదయం దారుణ ఘటన చోటుచేసుకొంది. ఘాజీమిల్లత్ నల్లవాగులోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘట స్థలానికి చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళలు తల్లీకుమార్తెలు షాజితా బేగం (60), ఫరీదాబాగం (32)గా గుర్తించారు. షాజితా బేగం భర్త దుబాయిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఆర్థికలావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నారు.