telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజిల్ : “వెర్రెక్కిద్దాం…” లిరికల్ వీడియో సాంగ్

Bigil

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా “రాజా రాణి” ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’. తెలుగులో బిగిల్ అంటే “విజిల్” అని అర్థం. ఇది వ‌ర‌కు ఈ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన ‘తెరి’ (పోలీస్‌), ‘మెర్స‌ల్’`(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా ‘బిగిల్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో సినిమాను ఏకకాలంలో విడుద‌ల చేస్తున్నారు. “బిగిల్” తెలుగు హక్కులు నిర్మాత మహేశ్ కొనేరు సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “వెర్రెక్కిద్దాం…” అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ విజయ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియోను వీక్షించండి.

Related posts