telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

Pspk

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 2). పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ ‌కు ట్విట్ట‌ర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, సమంత తదితర ప్రముఖులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ట్విట్టర్ వేదికగా ‘‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే , తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే, జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్ బాబు హ్యాపీ బర్త్ డే’’ అంటూ పవన్‌ను ఆలింగ‌నం చేసుకున్న ఫొటోను షేర్ చేశారు.

ఈ క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ మహేష్ కూడా ప‌వ‌న్ ‌కు బ‌ర్త్ డే విషెష్‌ను అంద‌జేశారు. “పవన్‌ కళ్యాణ్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నీ ద‌యాగుణం, విన‌యం స్ఫూర్తినిస్తుంటాయి. ఈ సంద‌ర్భంగా మీకు సంతోషం, ఆరోగ్యం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను” అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు ప‌వ‌న్‌తో ఉన్న ఓ ఫొటోను కూడా మహేశ్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

Many more happy returns of the day Our #Powerstar

Related posts