అక్షయ్‌కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై గాడ్ దీనికి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ రూపొందుతోంది. అక్షయ్‌కుమార్ మధ్యప్రదేశ్‌లో ఓ మై గాడ్ షూటింగ్ ప్రారంభించాడు. ఇందులో అక్షయ్ మరోసారి పరమేశ్వరుని పాత్రలో కనివిందుచేయనున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్‌పై ‘రఖ్ విశ్వాస్, తూ శివ్ కా దాస్’ అని కూడా రాసి ఉంది.
అలాగే ‘ఓ మై గాడ్ 2’ యొక్క పోస్టర్‌లను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, అక్షయ్ కుమార్, “కర్త కరే నా కర్ సాకే శివ్ కరే సో హోయే. ‘ఓ మై గాడ్ 2’ కోసం మీ ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు కావాలి, ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను ప్రతిబింబించేందుకు మా నిజాయితీ మరియు వినయపూర్వకమైన ప్రయత్నం. శాశ్వతమైన శక్తి కలగనివ్వండి. ఆదియోగి యొక్క ఈ ప్రయాణం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. హర హర మహాదేవ” అని పోస్ట్ చేశారు అక్షయ్.