telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ 4 లో ముగింపు దశలో మార్పులు…

Bigg-Boss-4

స్టార్ మా లో వస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4 షో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు అది ముగింపు దశకు చేరుకుంది. చివరి నాలుగు వారాల నుంచి బిగ్ బాస్ బాగా పుంజుకుంది. రేటింగ్స్ కూడా పర్లేదు అనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్టార్ మా సంచలన నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ టైమింగ్స్ మారుస్తూ తాజాగా యాడ్స్ విడుదల చేసారు.  ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది.. వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ వస్తుందని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పుడు బిగ్ బాస్ ప్రసారం అవుతున్న సమయంలో వదినమ్మ సీరియల్ రాబోతుంది. అది రాత్రి 7 గంటలకు వచ్చేది.. ఇప్పుడు ఆ సీరియస్ ప్లేస్‌లో గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ ప్రారంభం అవుతుంది. దాంతో బిగ్ బాస్ టైమింగ్స్ మారిపోతున్నాయి. డిసెంబర్ 20న బిగ్ బాస్ 4 తెలుగు ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7 మాత్రమే ఉన్నారు. అంటే కనీసం ఇంకా మూడు వారాల్లో ఈ బిగ్ బాస్ 4 సీజన్ ముగియనుంది.

Related posts