telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

bjp mlc madhav

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో అర్ధవంతమైన చర్చే లేదని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు ‌దూషించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని వాపోయాడు. ఈరోజు నాలుగు అంశాలు చర్చ జరగాల్సి ఉండగా.. ఒక్కటి కూడా జరగలేదన్నారు. ప్రజలు, ఉపాద్యాయుల సమస్యలుపై కూడా మాట్లాడనివ్వ లేదు, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి‌ నెట్టిందన్నారు. ప్రభుత్వానికి ఏ ఒక్క అంశం పైనా స్పష్టత లేదు, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది అని మాధవ్ మండిపడ్డారు. పాల సంఘాల విషయంలో ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రభుత్వం తీరు ఉంది, కేంద్రం  ప్రవేశపెట్టిన EWS ను రాష్ట్రంలో అమలు‌ చేయడం లేదు, దీనిపై విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు మొత్తం పాడైపోయినా ప్రభుత్వం స్పందించడం లేదు, రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం, ఇంటి పన్ను, చెత్తపై పన్ను పెంపు, రోడ్డుపై ప్రయాణానికి పన్నులు వేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆలయాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ లోపాలను నిలదీస్తే.. ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, తన పని తీరు మార్చుకుని ప్రజల సమస్యలు పరిష్కారంలో దృష్టి పెట్టాలని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ సూచించారు. మరి దీని పై వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా… లేదా అనేది చూడాలి. 

Related posts