రోహిత్ శర్మ వల్లే తాను ఐపీఎల్లో అరంగేట్రం చేశానని స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. రోహిత్ శర్మ తనకు అన్నలాంటివాడని, అతనితో బంధం విడదీయరానిదని తెలిపాడు. ఇక 2013 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన చాహల్.. రోహిత్ శర్మ చొరవతో మ్యాచ్ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. ఆ సీజన్లో తొలిసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హిట్‌మ్యాన్.. సీనియర్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా జట్టులో ఉన్నా.. చాహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి చాహల్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాతి సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చాహల్.. సూపర్ పెర్ఫామెన్స్‌తో స్టార్ స్పిన్నర్‌గా ఎదిగి అటు టీమిండియా.. ఇటు ఆర్సీబీలో కీలక బౌలరయ్యాడు. అయితే ముంబై తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో చాహల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో టోర్నీలో మిగతా మ్యాచ్‌ల్లో కూడా అవకాశం రాలేదు. ఇక 2014లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగగా.. అతనికి కావాల్సిన బ్రేక్‌త్రూ లభించింది.
							previous post
						
						
					
							next post
						
						
					

