*విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం..
*కార్యక్రమం కోసం వెళ్ళి తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదం
*సురక్షితంగా బయటపడిన విజయమ్మ
*వేరే కారులో వెళ్ళి పోయిన విజయమ్మ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలోని అయ్యప్పరెడ్డిని వైఎస్ విజయమ్మతో పాటు మరికొందరు పరామర్శించారు. అయ్యప్పరెడ్డిని పరామర్శించి వైఎస్ విజయమ్మ కారులో హైద్రాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
కర్నూల్ జిల్లా గుత్తి వద్దకు విజయమ్మ కారు చేరుకోగానే కారు రెండు టైర్లు పేలిపోయాయి. దీంతో కారు అదుపు తప్పింది. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపు చేశాడు. దీంతో వాహనం అదుపుతప్పింది. అయితే ఈ కారులో ప్రయాణిస్తున్న వైఎస్ విజయమ్మ సహా మిగిలినవారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటన అనంతరం విజయమ్మ వేరే కారులో వెళ్లిపోయారు.
సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏపీ ప్రజలంతా ఔటే: కేఏ పాల్