ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా శక్తిమంతులైన టాప్ టెన్ నేతల్లో చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు.
ఇక అత్యంత శక్తిమంతులైన సీఎంలలో చంద్రబాబు తర్వాత బీహార్, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఎంకే స్టాలిన్, మమతాబెనర్జీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఉన్నారు.
జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్ పక్షిలా పునర్జన్మనెత్తి.. అధికారం చేజిక్కించుకున్నారని ‘ఇండియా టుడే’ కథనం అభివర్ణించింది.
ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని పేర్కొంది.
అలాగే జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడి టీడీపీని పతనావస్థ నుంచి విజయతీరానికి చేర్చారని మంగళవారం నాటి తన ప్రత్యేక కథనంలో చంద్రబాబుకు ‘ఇండియా టుడే’ కితాబునిచ్చింది. ఇవాళ చంద్రబాబు భారత్‌లోనే అత్యంత సీనియర్ సీఎం అని తెలిపింది.
ఇక కార్పొరేట్లతో స్నేహభావంతో మెలిగే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజనెస్ (ఐఎస్బీ) ఏర్పాటుకు చొరవ చూపించారు” అని ‘ఇండియా టుడే’ తన కథనంలో రాసుకొచ్చింది.