telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

వైఎస్ షర్మిల కొత్త పార్టీ…?

ys sharmila as ycp party working president

ఏపీలో జగన్ రాజ్యం ఏలుతున్న విషయం తెలిసిందే. అయితే అన్నకు తగ్గ చెల్లెలుగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారన్న ఊహగానాల నడుస్తున్న వేళ… ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఆమె సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ నివాసంలో వైఎస్ అభిమానులతో సమావేశం కానున్నారు షర్మిల. అయితే, షర్మిల సమావేశం అజెండాను ప్రకటించకపోవడంతో ఆమె ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఆత్మీయ సమ్మేళనానికే పరిమితం అవుతారా? లేక రాజకీయ పార్టీ ఏర్పాటుకు షర్మిల ప్రయత్నిస్తారా అనే అంశంపై ఏపీ, తెలంగాణలో చర్చ జరుగుతోంది. ఇక, ఈ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకున్నారు వైఎస్ షర్మిల.. తన భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి బెంగళూరు నుంచి లోటస్‌పాండ్‌ చేరుకున్నారు.. రేపటి సమావేశంలో వైఎస్ షర్మిలతో పాటు బ్రదర్ అనిల్‌ కూడా పాల్గొంటారా? అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా వైఎస్ అభిమానులతో పాటు షర్మిల అనుచరులు కూడా హాజరు కానున్న ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి నేడు ఏం జరుగుతుంది అనేది.

Related posts