telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు చెక్‌ పెట్టేందుకు ఏపీ సర్కార్‌ చర్యలు..

cm jagan

రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు చెక్‌ పెట్టేందుకు ఏపీ సర్కార్‌ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అనధికార అక్రమ లే అవుట్లను గుర్తించి జాబితా సిద్దం చేసిన ప్రభుత్వం…34,167 ఎకరాల విస్తీర్ణంలో 6076 అక్రమ, అనధికార లే అవుట్లను గుర్తించింది. నిబంధనలకు విరుద్దంగా ఉన్నవి.. ప్రభుత్వ భూములను కబ్జా చేసినవి.. వివాదాల్లో ఉన్న లే అవుట్లను గుర్తించిన అధికారులు…జిల్లాల వారీగా జాబితాను సిద్దం చేశారు. అక్రమ లే అవుట్ల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీస్‌ బోర్డుల్లో ఉంచనున్న అధికారులు….అక్రమ లే అవుట్ల జాబితాలను అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అందజేశారు.

అనుమతుల్లేని లే అవుట్లల్లోని ప్లాట్లను రిజిస్టర్‌ చేయొద్దని సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో అక్రమ లే అవుట్లు ఉన్నట్లు..అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో అక్రమ లే అవుట్లు ఉన్నట్లు గుర్తించారు. తూ.గో జిల్లాలో 13,158.86 ఎకరాల విస్తీర్ణంలో 1574 అక్రమ లే అవుట్లను గుర్తించింది ప్రభుత్వం. ప్రకాశం జిల్లాలో 219.06 ఎకరాల విస్తీర్ణంలో 63 అక్రమ లే అవుట్లు ఉన్నట్టు…శ్రీకాకుళం జిల్లాలో 243, విజయనగరం జిల్లాలో 167, విశాఖ 347 అక్రమ లే అవుట్లను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 960, కృష్ణాలో 433, గుంటూరు జిల్లాలో 187 అనధికార లే అవుట్లను గుర్తించిన అధికారులు. నెల్లూరు జిల్లాలో 750, చిత్తూరు జిల్లాలో 426, కడప జిల్లాలో 166, కర్నూలు జిల్లాలో 282, అనంతలో 478 అక్రమ లే అవుట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

Related posts