telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ

వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు . పార్టీ బలోపేతం, బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి తప్పకుండా మళ్లీ మనం అధికారంలోకి వస్తాం అన్నారు.

ప్రజలకిచ్చిన ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదు. 2014లో మోసం చేసినట్లే ఇప్పుడూ మోసం చేస్తున్నారు.

మన హయాంలో పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి , ఇప్పుడు చంద్రబాబు ప్రజలు తింటున్న కంచాన్ని లాగేశాడు అన్నారు.

రెండు రకాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరు గారిపోయాయి , రైతు భరోసా, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయాయి కూటమి పాలనలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది అన్నారు.

రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ.. అదే రూపాయికి వేలకోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారు.

లులూకు రూ.1500 కోట్ల విలువైన భూములను కట్టబెట్టారు, అడ్రస్ లేని ఉర్సాకు రూ.3వేల కోట్ల భూములను కట్టబెట్టారు అని వైఎస్ జగన్ అన్నారు.

Related posts