telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్… పిక్స్ వైరల్

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లో అదిరిపోయే లుక్స్ తో రెబల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. లేటెస్ట్ గా తాను నటిస్తున్న “రాధే శ్యామ్” షూట్ కోసం ప్రిపేర్ అవుతుండగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ ఇపుడు బయటకొచ్చాయి. మాస్క్ తో షార్ట్ హోల్డ్ చేస్తూ ఉన్న ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉంది. మరోవైపు ప్రభాస్ “ఆదిపురుష్” అనే పాన్ ఇండియా మూవీలో, అశ్విని దత్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Related posts