telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో వెనుకబడ్డ వై సి పి మంత్రులు

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే, పలు చోట్ల అధికార వైసీపీకి చెందిన మంత్రులు వెనుకంజలో ఉన్నారు.

డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నగరిలో రోజా, గుడివాడలో కొడాలి నాని, చెల్లుబోయిన వేణు, మంత్రి అంబటి రాంబాబు, మంత్రి అమర్ నాథ్ వెనుకంజలో కొనసాగుతున్నారు.

అటు మాచర్లలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనకబడ్డారు. ప్రస్తుతం కూటమి అభ్యర్థులు 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ 27, జనసేన 6 స్థానాల్లో లీడింగ్లో ఉంది.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. భీమవరంలో అంజిబాబు,

పిఠాపురంలో పవన్ కల్యాణ్, తిరుపతి అసెంబ్లీ స్థానం, పి.గన్నవరం సహా పలు చోట్ల కూడా జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Related posts