telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ప్రియురాలితో ఉండగా భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య…

పెళ్లి చేసుకున్న తనను కాదని.. ప్రియురాలితో కాపురం పెట్టిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది ఓ భార్య. ఈ ఘటన శనివారం తిరుపతిలో జరిగింది. సంబంధించిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని పద్మావతి నగర్ కు చెందిన చంద్రమౌళి స్థానిక కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. అతనికి చాలా క్రితమే కవిత అనే మహిళతో వివాహమైంది. కానీ అతడు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే కాలనీలో మరో ఇంటిని అద్దెకు తీసుకొని ప్రియురాలిని అక్కడ ఉంచాడు. ఈ విషయం తెలిసిన భార్య కవిత.. వీరిద్దరినీ పట్టుకొనేందుకు బంధువులతో కలిసి భర్త ప్రియురాలు ఉంటున్న ఇంటికి వెళ్లింది. ప్రియురాలితో ఉన్నప్పుడు భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో గోడదూకి పారిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళ.. భర్త ప్రేయసి ఇంటి ముందు ఆందోళ చేపట్టింది. అయతే ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆ భర్త పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక న్యాయవాదిగా అందరికి న్యాయం చేయాల్సిన పదవిలో ఉన్న అతను చెప్పిన తప్పును విమర్శిస్తున్నారు.

Related posts