telugu navyamedia
సామాజిక

ఇంట్లో తెల్ల రంగు ఏనుగులు పెడితే అష్ట ఐశ్వ‌ర్యాలు..

మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి అంటే, ఫలానా వాళ్ళు కనిపెట్టారు అని చెప్పలేం గాని, మన పూర్వీకుల నుండి మనకి సంక్రమించాయి అని మాత్రం చెప్పచ్చు. ఏనుగు బొమ్మ హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది మరియు శక్తి, సమగ్రత మరియు బలాన్ని సూచించడానికి తరచుగా ఇంటి అలంకరణలో ఉపయోగిస్తారు.

ఏనుగులు పోరాట శక్తికి, సంతానోత్పత్తికి, శుభాలకి ప్రతీకలు. ఈ ఏనుగు బొమ్మల్లో కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టాన్ని వెంట తీసుకుని వస్తుంది. మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలి ప్రవేశించలేవట. అందుకే మన పురాతన దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు. అవి చెడు శక్తులను లోపలకి రానీయవు.

The Objects That Bring Good Luck To Your House - Decoholic

అలాగే బెడ్ రూమ్ లో రెండు తెల్లరంగు ఏనుగులు జతగా ఉన్న ఫోటోలు పెట్టినా దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం కలుగుతుంది.ఇది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది.అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి కనుక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే బెడ్ రూమ్ లో ఈ మార్పులు చేయండి.

ఆఫీస్ ఫ్రంట్ డోర్ ముందు ఏనుగు విగ్రహాన్ని ఉంచితే… కెరీర్ డెవలప్ అవుతుంది. మీరు పని చేసే చోట, మీరు ఉండే టేబుల్ పైన కూడా ఏనుగు బొమ్మలు ఉండేలా చేసుకోండి. తద్వారా మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఒత్తిడిలో కూడా బాగా పనిచేయగలరు.

అలాగే ఏనుగు పెయింటింగ్స్‌ను పిల్ల‌ల స్టడీ రూమ్ లో లేదా ఆఫీసులో వేలాడదీయడం కూడా అదృష్టంగా భావిస్తారు. అయితే ఇంట్లో పెట్టే బొమ్మలు ఇంటి లోపలి వైపు చూస్తునట్టు పెట్టాలి గాని అవి బైటకి చూస్తునట్టు, తొండం బైట వైపు చూపిస్తునట్టు ఉండకూడదు. కాబట్టి ఈ చిన్న మార్పులను ఇంట్లో చేసి ఆరోగ్యంగా ఉండండి. సమస్యలేవీ లేకుండా సంతోషంగా ఉండండి.

Related posts