telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పులివెందుల లో 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశాము: నారా చంద్రబాబు నాయుడు

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు.

ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.

30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి పులివెందుల జెడ్పీటిసీ ఉప ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటర్లు స్లిప్ పెట్టారని అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలని సూచించారు.

టీడీపీ నేతలు పులివెందుల విజయంపై ప్రజలను చైతన్యం చేసే విధంగా మాట్లాడాలని మార్గ నిర్దేశం చేశారు.

పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని నొక్కిచెప్పారు.

30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ఓటు వేశారనేది ఏపీలో ప్రజలకు తెలియచేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని కూడా చెప్పాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Related posts