telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించాము: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

గత పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్నిచేపట్టడమే కాకుండా వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రజా ప్రభుత్వం రెండో సంవత్సరం విజయోత్సవ సభలను మక్తల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ప్రారంభించారు.

ముందుగా శ్రీ శ్రీ శ్రీ పడమటి ఆంజనేయస్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తర్వాత నియోజకవర్గంలోని మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 118.82 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం స్థానికంగా అంబేద్కర్ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. దశాబ్దాల కాలంగా పాలమూరు జిల్లా వెనుకబాటు అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.

పాలమూరు జిల్లాలో పాడిపంటలు పండాలన్న లక్ష్యంతో దశాబ్ద కాలంగా పాతాళానికి తొక్కివేయబడిన జీవో 69 ను బయటకు తీయడమే కాకుండా నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పనులను మొదలు పెట్టబోతున్నట్టు తెలిపారు.

సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించడానికి నిరంతరం పనిచేశాం. ప్రజా ప్రభుత్వం రైతుల కోసం 1.04 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాం.

ఉన్న కష్టాలను అధిగమిస్తూ, అప్పులు చెల్లించుకుంటూ వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం..” అని అన్నారు.

Related posts