కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న 48 గంటలూ అత్యంత కీలకమని వైద్యులు తెలిపారు. 74 ఏళ్ల వయసు గల ట్రంప్‌కు స్థూలకాయం, కొలెస్టరాల్ ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ఇదివరకే ధృవీకరించారు. ప్రస్తుతం ఆయనకు రెమ్‌డెసీవీర్‌తో పాటు యాంటీబాడీలతో కూడిన వైద్యాన్ని అందిస్తున్నారు.
తొలుత వైట్ హౌస్ లోనే చికిత్స పొందాలని ట్రంప్ భావించినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి, వయసు దృష్ట్యా, ప్రత్యేక హెలికాప్టర్ లో వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయన కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల తరువాతే ఆయన ఆరోగ్యంపై ఓ అవగాహనకు రావచ్చని తెలుస్తోంది.
ఆసుపత్రి నుంచే కొంతకాలం పాటు ట్రంప్ విధులు నిర్వహిస్తారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక మెలానియా ట్రంప్ కు స్వల్పంగా దగ్గు మాత్రమే ఉందని, ఆమె త్వరగానే కోలుకుంటారని వైద్య వర్గాలు వెల్లడించారు. వైట్ హౌస్ కువెళ్లిన ముగ్గురు మీడియా ఉద్యోగులకు, ఇద్దరు సెనెటర్లకు, ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజర్ కు, మాజీ సలహాదారుడికి కూడా కరోనా బారినపడ్డారు. వారందరూ ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మతాలను వాడుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య: రఘువీరా