డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఓ జట్టు యూకే పర్యటనకు వెళ్లనుండగా.. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోని మరో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇలా ఒకే సమయంలో రెండు జట్లను ఆడించడంపై లక్ష్మణ్ స్పందించాడు. ‘టీమిండియా ప్రతిభకు నిదర్శనం. రెండు కాదు.. ఏక కాలంలో మూడు జట్లను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడించగల దమ్ము భారత క్రికెట్ సొంతం. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతిభకు కొదవలేదు. దేశవాళీ క్రికెట్ వ్యవస్థ.. భారత్-ఎ జట్ల పర్యటనలు.. ఐపీఎల్.. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీల మార్గనిర్దేశం ఈ ఘనతకు కారణం. భారత దేశవాళీ క్రికెట్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. పటిష్టమైన రిజర్వ్ బెంచ్‌కు అదే కారణం. ఐపీఎల్ కూడా కీలకపాత్ర పోషించింది. పేరుకు టీ20 ఫార్మాట్ అయినా ప్రతిభావంతులు వెలుగులోకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మిగతా జట్ల కంటే టీమిండియా చాలా ముందుంది.’అని ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ చెప్పుకొచ్చాడు.
previous post