telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్: తొలి ఓటు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఉప రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్ మొదలైంది. పార్లమెంటు కొత్త భవనంలో ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు.

ఆయన వెంట పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాగా, తొలి ఓటు వేసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో దానిని షేర్ చేశారు.

ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది.

జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయేకు ఉభయసభల్లోనూ కలిపి తగినంత సంఖ్యాబలం ఉండటంతో గెలుపు దాదాపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి.

 

Related posts