telugu navyamedia
Uncategorized

బాలు మృతి పట్ల విషాదానికి లోనయ్యాను: విశ్వనాథన్ ఆనంద్

Vishwanathan Anand

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం కళా రంగాన్ని మాత్రమే కాదు క్రీడారంగాన్ని కూడా విషాదంలో ముంచెత్తింది. బాలు మృతి పట్ల ఎంతో విషాదానికి లోనైనట్టు చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఎంతో గొప్ప వ్యక్తి అయినప్పటికీ చాలా నిరాడంబరంగా ఉండేవారని కితాబిచ్చారు.

1983లో జాతీయ స్థాయిలో జరిగిన చెస్ చాంపియన్ షిప్ లో చెన్నై కోల్ట్స్ జట్టుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పాన్సర్ గా వ్యవహరించారని వెల్లడించారు. “ఆయనే నా తొలి స్పాన్సర్. నేను కలిసిన సహృదయులైన వ్యక్తుల్లో ఆయనొకరు. ఆయన గాత్రం ఎంతో ఉల్లాసాన్ని అందించింది. ఎస్పీ బాలు ఆత్మకు శాంతి కలుగుగాక” అంటూ విశ్వనాథన్ ట్వీట్ చేశారు.

Related posts