telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై డీజీపీ కి వినీత్ బ్రిజ్ లాల్ నివేదిక సమర్పించారు.

ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు  13 మంది సభ్యులతో సిట్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది.

మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది.

ఈ దమనకాండపై రెండు రోజులపాటు అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లి విచారణ జరిపింది. ప్రతి అంశాన్ని సిట్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు.

హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో సిట్ విచారణ పూర్తి చేసింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు.

150 పేజీలతో సుదీర్ఘ నివేదికను వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీ కి సమర్పించారు. ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఈ నివేదికను సీఈసీ, ఎన్నికల సంఘం సీఈవోకు డీజీపీ అందజేయనున్నారు.

Related posts