ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలు ఈ రోజు నల్లచొక్కాలతో హాజరైన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లారు. ఆయన నల్ల చొక్కా ధరించిన ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్ట్ చేసి విమర్శలు గుప్పించారు.
‘నాయుడూ వాటే కలర్సెన్స్’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? అని ప్రశించారు. ఏడాది కాలంగా ఏపీలో ప్రభుత్వ తీరుకి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు నల్లచొక్కాలు వేసుకుని ఈ రోజు పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.

