టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. కియా కంపెనీ లేచిపోతోందంటూ ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదని ఆయన అన్నారు. నిప్పుకణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని చంద్రబాబు ఇప్పటికే ఐటీ శాఖను నిలదీయాలని ఎద్దేవా చేశారు. ఈ సోదాలపై రెండు రోజులుగా కిక్కురుమనకుండా ఉన్నారని పేర్కొన్నారు.
ఇక నుండి కర్ణాటకలో కొత్త తరహ అభివృద్ది: బీజేపీ నేత యడ్యూరప్ప