టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో నేషనల్ స్టార్‌గా మారాడు. ప్రస్తుతం అతని సినిమాలకి తెలుగులోనే కాదు హిందీలోను మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ సెలబ్స్‌తో కలిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోలో దీపికా పదుకొణే, అలియా భట్, రణ్‌వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండ, పార్వతి తిరువొత్తు, మనోజ్ బాజ్‌పేయ్ ఉన్నారు. నవంబర్ 14,2019 న దీపికా- రణ్ వీర్ సింగ్‌ల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో వారు శ్రీవారి దర్శనం కోసం గురువారం తిరుమలకి వచ్చిన విషయం తెలిసిందే. నార్త్, సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ ఒకే ఫ్రేమలో కనిపించే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే వీరందరు కలవడానికి కారణం ఏమై ఉంటుందా అనే దానిపై ఫ్యాన్స్ చర్చలు జరుపుతున్నారు.
next post