సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అమాయకులను మోసం చేసే మోసగాళ్లు ఎక్కువైపోయారు. తాజాగా విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ తెరిచి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. విజయ్ దేవరకొండ పేరుతో కొన్ని రోజులక్రితం నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచిన వ్యక్తి. వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తున్న యువతులతో అతగాడు ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ ముచ్చట్లు పెడుతున్నాడు. ఈ వ్యవహారాన్ని ఇటీవల కొందరు సన్నిహితులు విజయ్ దేవరకొండ దృష్టికి తీసుకెళ్లారు. సదరు మోసగాడికి చెందిన వాట్సాప్ నంబర్ సైతం అందించారు. దీంతో అసలు నిజం తెలుసుకోవాలని భావించిన ఆయన తన వద్ద సహాయకుడిగా పని చేసే గోవింద్‌ను యువతి మాదిరిగా ఆ నంబర్‌తో చాటింగ్ చేయమని చెప్పగా తన పేరు హేమ అంటూ పరిచయం చేసుకున్న గోవింద్ ఆ మోసగాడితో చాటింగ్ చేసాడు. తాను విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని అంటూ పరిచయం చేసుకున్న అతగాడు అందరు అమ్మాయిలకు చెప్పే కథలే ఇక్కడా చెప్పాడు. దీంతో మంగళవారం గోవింద్‌తో పాటు విజయ్ దేవరకొండ మేనేజర్ సైతం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
previous post
ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లతో సినిమా అంటే నిద్ర పట్టదు… నిధి అగర్వాల్