సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్‌లో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా “డియర్ కామ్రేడ్”. “యు ఫైట్ ఫర్ వాట్ యు లవ్” ట్యాగ్ లైన్. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. సామాజిక బాధ్యత ఉన్న ఇన్టెన్సివ్ పాత్రలో విజయ్ దేవరకొండ మెప్పించనున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. “డియర్ కామ్రేడ్” ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ట్రైలర్లో ఉన్న విజయ్, రష్మిక లిప్‌లాక్ సీన్స్ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఈ ముద్దు సీన్ల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ ముద్దు సీన్ల గురించి మాట్లాడాడు. “నిజం చెప్పాలంటే సినిమా కోసం చేసే ముద్దు సన్నివేశాలు మా వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెడుతున్నాయి. మా గురించి చెడుగా, అసహ్యంగా మాట్లాడుకునేలా చేస్తున్నాయి. సినిమాతో పోల్చి మా నిజం జీవితం గురించి కూడా తప్పుగా మాట్లాడతారు. అయితే సినిమాకు వచ్చే ప్రేక్షకుణ్ని ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో కొన్నిసార్లు అలాంటి సీన్లలో నటించాల్సి వస్తుంది. ఒక సినిమా అనేది ఎంతో మందికి భవిష్యత్తు. కొన్ని వందల మంది జీవితాలు ఒక సినిమాపై ఆధారపడి ఉంటాయి. ఒక సినిమా కోసం చాలా కష్టపడతాం. ప్రేక్షకుణ్ని మెప్పించేందుకు ఏమి చెయ్యాలో అంతా చేస్తాం. సినిమా విడుదలై ఫలితం బాగుంటే పడిన కష్టమంతా మర్చిపోతాము” అని విజయ్ చెప్పాడు.
previous post
next post