యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం “అర్జున్ సురవరం” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు విశేషమైన స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత నిఖిల్ హీరోగా “శ్వాస” అనే సినిమా ప్రారంభం కావాల్సివుంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన నివేదా థామస్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రానికి కిషన్ కట్టా దర్శకుడు. నిర్మాతలు తేజ్ ఉప్పలపాటి, హరికిషన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ అంటూ “శ్వాస” చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. అయితే ఏమయ్యిందో గానీ ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్రబృందం ప్రకటించకపోయినా ఇదే నిజమని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో నిఖిల్ ఇప్పుడు చందూ మొండేటి దర్శకత్వంలో “కార్తికేయ-2″లో నటించడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం.
previous post
పవన్ వల్ల తలవంపు… శర్వానంద్ షాకింగ్ కామెంట్స్