telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి లెక్చరర్ గా విక్టరీ వెంకటేష్ ?

Venky

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌ గా రూపొందుతున్న నారప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి, వెంకీ భార్య పాత్రలో కనిపించనుంది. లాక్‌డౌన్‌తో బ్రేకుల పడ్డ ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే తిరిగి ప్రారంభం కాబోతోంది. కాగా నారప్ప తరువాత వెంకటేష్, ఎఫ్‌ 3లో నటించనున్నారు. దీంతో పాటు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ వెంకీ ఓ మూవీలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ గుర్రపు పందేల బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్నట్లు తెలుస్తుండగా, ఇందులో వెంకీ లెక్చరర్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్‌. గతంలో వెంకటేష్‌ సుందరాకాండలో లెక్చరర్‌గా కనిపించిన విషయం తెలిసిందే. ఇక సురేష్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేష్ బాబు నిర్మించనున్న ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభింబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts