telugu navyamedia
రాజకీయ

భారత ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన వంగూరి ఫౌండేషన్ 100వ గ్రంథం ..

ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంథాన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ .. 27 ఏళ్ళుగా తెలుగు భాషా, సాహిత్యాలకి సేవలు అందిస్తూ వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని తెలిపారు. ఆ సదస్సు నిర్వహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (ఆస్ట్రేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య (ఇంగ్లండ్), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్) సంస్థలని ఆయన అభినందించారు., ఈ సందర్భగా వంగూరి ఫౌండేషన్ గత 27 ఏళ్ళగా సాధించిన ప్రగతిని, సాహిత్య ప్రస్థానాన్ని పదిలపరిచిన వీడియో ప్రసారాన్ని గౌ. ఉపరాష్ట్ఱపతి ఎంతో ఆసక్తితో వీక్షించి, ప్రశంసించారు.

ఈ అవిష్కరణ మహోత్స కార్యక్రమాన్ని రాధిక మంగిపూడి నిర్వహించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), శాయి రాచకొండ లతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ చేశారు.

Vice President virtually releases 100th book of Vanguri Foundation of America | News - Times of India Videos

గౌ. ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక 520 పేజీలతో సర్వాంగ సుందరంగా తయారయ్యింది . అపురూపమైన ఈ గ్రంథాన్ని సాహిత్య ప్రేమికులు చదవాలని వంగూరి చిట్టెన్ రాజు కోరుతున్నారు .

అక్టోబర్ 10-11, 2020 తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” జరిగింది . అంతర్జాలం లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరిగిన సదస్సు ను పది వేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు వీక్షించి సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ఈ బృహత్ సాహితీయజ్ఞం లో ఐదు ఖండాల నుండి, సుమారు 200 మంది సాహితీవేత్తలు 15 ప్రసంగ వేదికలలో పాల్గొని వివిధ అంశాల మీద ప్రసంగించారు. 15 నూతన పుస్తకావిష్కరణలూ, చర్చావేదికలతో వైవిధ్యభరితమైన ఈ సాహితీ సదస్సును ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ ప్రార్ధనాగీతాన్ని ఆలపిస్తూ ఉండగా , దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ సింగపూర్ భారత్ ఇంగ్లాండ్ అమెరికా దేశాలలోని తెలుగు ఆడపడుచులు దీప ప్రజ్వలన గావించారు.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (అమెరికా, హైదరాబాద్), శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (మెల్ బోర్న్, ఆస్ట్ఱేలియా), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్), సి.పి. బ్రౌన్ తెలుగు సమాఖ్య (లండన్) సంస్థల సంయుక్త నిర్వహణ లో జరిగిన ఈ సదస్సు ప్రారంభ సభని వంగూరి చిట్టెన్ రాజు నిర్వహిస్తూ ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ని స్వర్గీయ ఎస్. పీ. బాల సుబ్రమణ్యానికి అంకితం ఇచ్చారు. పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సభకు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి అభినందనలను సందేశాన్ని అందజేయగా, డా. కె.వి రమణాచారి, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, ప్రముఖ సినీ నటులు రచయిత శ్రీ తనికెళ్ళ భరణి, ఆచార్య సి. మృణాళిని, శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, ఆచార్య ఆవుల మంజులత గారు సముచిత ప్రసంగాలు చేశారు.

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు తరఫున వంగూరి, మధు పెమ్మరాజు, డా. రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు, డి.ఆర్. ఇంద్ర, చాయా మోహన్ సత్కార బృందం వారు ప్రముఖ రచయిత సాహితీవేత్త శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారికి “జీవన సాఫల్య పురస్కారం’ ప్రదాన సభ వైభవోపేతంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి గారు ఈ సదస్సుకు అంకితమిస్తూ ప్రత్యేకంగా ఒక గీతాన్ని వ్రాసి ఆలపించారు. ప్రత్యేక అంశాలుగా అండమాన్, నికోబార్ దీవులలొ తెలుగు వారి సాహిత్య సేవ గురించి మొదటి సారిగా ప్రపంచానికి శ్రీ మేడసాని శ్రీనివాస్ వివరించారు. సభలో పాల్గొంటున్న పిన్న వయస్కురాలు సిసిలిక రామరాజు తన స్వీయ రచనను చదివి వినిపించారు.

15 దేశాల రచయితలు పాల్గొన్న ఈ రెండు రోజుల పాటు నిర్విరామ సాహితీ సదస్సు లో ప్రముఖ సాహితీ వేత్త భువన చంద్ర తో ముఖా ముఖీ, ఎస్.పీ. బాలూ కి చెరుకూరి రమాదేవి (డిట్రాయిట్) గారి ఆత్మీయ నివాళి, పొత్తూరి విజయ లక్ష్మి, రామా చంద్రమౌళి, డా. శిఖామణి, ముక్తేవి భారతి, ఆచార్య కాత్యాయని విద్మహే, వడ్డేపల్లి కృష్ణ, ఆచార్య ఎస్. వీ సత్యనారాయణ, కె. శ్రీనివాస రావు (సాహిత్య ఎకాడెమీ), వోలేటి పార్వతీశం, రేవూరు అనంత పద్మనాభ రావు, అత్తలూరి విజయలక్ష్మి, పాపినేని శివశంకర్, ‘హాస్య బ్రహ్మ’ శంకర నారాయణ, రేణుక అయోల, రాజేశ్వరి శివుని, గంగిశెట్టి లక్ష్మీనారాయణ మొదలైన భారత దేశ రచయితలు, 15 దేశాల ప్రముఖ రచయితల ప్రసంగాలూ ఆసక్తికరంగా సాగాయి.

అనేక దేశాల నుండి సుమారు 30 మంది సాంకేతిక నిపుణులు, 15 మంది ప్రసంగ వేదికల నిర్వాహకులు అహర్నిశలూ శ్రమించి విజయవంతం చేసిన ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన కార్య నిర్వాహక వర్గం సభ్యులు వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ (హ్యూస్టన్), రత్న కుమార్, రాధిక మంగిపూడి (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బోర్న్), రాపోలు సీతారామరాజు (జొహానెస్ బర్గ్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), వంశీ రామరాజు (హైదరాబాద్) కాగా రాధాకృష్ణ & కాత్యాయని గణేశ, భాస్కర్ ఊలపల్లి, సుధాకర్ జొన్నాదుల (సింగపూర్), కృష్ణ రావిపాటి (మెల్ బోర్న్), మధు చెరుకూరి (ఆర్లండో), రఘు ధూళిపాళ (సియాటిల్) తదితరులు ప్రధాన సాంకేతిక నిపుణులు గా సేవలు అందించారు.

ఈ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన “భారతమెరికా” గ్రంథాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె ,వి రమణాచారి , నటులు, దర్శకులు ఎస్ .వి .కృష్ణా రెడ్డి , కె .అచ్చి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు . 2014లో భగీరథ వంగూరి చిట్టెన్ రాజు గారి ఆహ్వానంపై అమెరికాలోని హ్యూస్టన్ నగరం లో జరిగిన 9వ అమెరికా సాహిత్య సదస్సులో పాల్గొన్నారు . ఈ పర్యటన అనుభవాలతో వ్రాసిందే “భారతమెరికా “. గ్రంథం. దీనిని చిట్టెన్ రాజు గారికి అంకితం ఇచ్చారు .

Related posts