telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌ : … మొదటి ఆధార్ సేవాకేంద్రం.. మాదాపూర్ లో ప్రారంభం..

aadhar

దేశవ్యాప్తంగా పలు చోట్ల యూనిక్ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధార్‌ సేవా కేంద్రాలను అందుబాటులోకి తెస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని మాదాపూర్‌లో తన తొలి ఆధార్‌ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. నగరంలో ఇప్పటికే ఆధార్‌ సెంటర్లలో, పోస్టు ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులతో పాటుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్లలలో సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యుఐడిఎఐ మాదాపూర్‌లోని విఠల్‌ రావు నగర్‌లోని రిలయెన్స్‌ సైబర్‌ విల్లాలో ఆధార్‌ సేవా కేంద్రాన్ని నూతనంగా ప్రారంభించింది.

ఎన్‌రోల్‌మెంట్‌ ఫీజు రూ. 50 చెల్లించి ఈ ఆధార్‌ సేవలను పొందాలనుకునేవారు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించింది. రోజుకి వెయ్యి మందికి సేవలు అందించగలమని, వారంలో ఏడు రోజుల పాటు సేవలు కొనసాగించనున్నట్లు తెలిపింది. స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకునేందుకు https://ask.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

Related posts