శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం, తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వారిని దర్శించుకునేందుకు భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70,830 మంది భక్తులు దర్శించుకున్నారు.

