telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ బుడ్డోడు నిజంగా మృతుంజయుడే

Toodler

పిల్లల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమారినా ఏదో ఒక ప్రమాదం బారిన పడుతుంటారు. అందుకే వారిని ప్రతి క్షణం కంట కనిపెట్టుకుని ఉండాలి. చైనాలో ఓ రెండేళ్ల బాలుడు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని మృతుంజయుడిగా నిలిచాడు. జియంగ్స్ రాష్ట్రం హువాయియన్ లో తల్లిదండ్రులు ఏమరుపాటుగా ఉన్న సమయంలో రెండేండ్ల బాలుడు ఐదంతస్తుల ఇంట్లో నుంచి బాల్కనీలోకి వచ్చాడు. సైడ్ వాల్ ఎక్కి ఆడుకుంటూ పట్టుతప్పి గాల్లో పల్టీలు కొడుతూ పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి రోడ్డున వెళ్తున్నవారు ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. అంతలో ఆ చిన్నారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మధ్యలో ఓ కిటికీ రెయిలింగ్ ని పట్టుకున్నాడు. కొన్ని సెకండ్ల పాటు అలాగే ఉండిపోయాడు. ఆలోపు అక్కడి వారు బిల్డింగ్ కిందకు చేరడం, బాలుడు గాల్లో గిర గిరా తిరుగుతూ కిందపడుతుండగా ఓ వ్యక్తి పరుగున వచ్చి అమాంతంగా పట్టేసుకోవడం అంతా రెప్ప పాటులో జరిగి పోయింది. చూస్తున్న వారికి ఇది కలా నిజమా అని సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. బాలుడి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని అభినందనలతో ముంచెత్తారు.

Related posts